అధ్యక్షా... నేను చెప్తున్నా... ఏపీకి మూడు రాజధానులు రావొచ్చు : సీఎం జగన్

మంగళవారం, 17 డిశెంబరు 2019 (19:00 IST)
నవ్యాంధ్ర రాజధానిపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి ఓ రకంగా క్లారిటీ ఇచ్చారు. విభజానంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయని ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు. అవి అమరావి, విశాఖ, కర్నూలుగా ఉంటాయనే విధంగా సెలవిచ్చారు. దీనిపై తాము ఏర్పాటు చేసిన నిపుణుల కమిటి నివేదిక మరోవారం రోజుల్లో వస్తుందని, ఆ తర్వాత స్పష్టత వస్తుందని ఆయన మంగళవారం అసెంబ్లీ వేదికగా వెల్లడించారు. 
 
అసెంబ్లీ రాజధానిపై జరిగిన చర్చలో భాగంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌కు బహుశా మూడు రాజధానులు వస్తాయేమో. మూడు రాజధానులు నిర్మించే ఆలోచనలో ఉన్నాం. పాలన ఒకదగ్గర.. జుడీషియల్ ఒకదగ్గర ఉంటాయి. అమరావతిలో చట్టసభలు. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ రావచ్చు. కర్నూలులో హైకోర్టు పెట్టొచ్చు. వారం రోజుల్లో నిపుణుల కమిటీ నివేదికు ప్రభుత్వానికి సమర్పిస్తుంది. త్వరలో రాజధానిపై నిర్ణయం తీసుకుంటామని సభకు తెలిపారు. 
 
అంతేకాకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు మంచినీరు ఇవ్వాలంటే రూ.40 వేల కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలకు రూ.లక్షా 9 వేల కోట్లు ఖర్చవుతుందని చంద్రబాబు తెలిపారు. కానీ, బాబు హయంలో కేవలం రూ.5 వేల 800కోట్లే ఖర్చు చేశారు. దానిపై వడ్డీయే రూ.700 కోట్లు అవుతోందని చెప్పుకొచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు