ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. కరోనా వల్ల ఇప్పటి వరకు సంస్థ రూ.2,603 కోట్ల మేర రాబడి కోల్పోయింది. ఈ ఏడాది సగటు ఓఆర్ 59.14 శాతమే ఉంది. డిసెంబరులో ఓఆర్ 70.74 శాతానికి పెరిగింది. మార్చినాటికి సాధారణ పరిస్థితి వస్తుంది... అని వివరించారు.
సంక్రాంతి ప్రత్యేక సర్వీసుల్లో సగం ఛార్జీ అదనంగా ఉంటుందని పేర్కొన్నారు.
* 5,586 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన పడగా.. 91 మంది మరణించారు. వీరికి కేంద్రం ప్రకటించిన రూ.50లక్షల పరిహారం ఇవ్వాలని ప్రతిపాదన పంపాం.
* ఉద్యోగులు ప్రజారవాణాశాఖలో విలీనమైనప్పటికీ, కేడర్ల కేటాయింపు, పేస్కేల్ ఖరారు కోసం వివరాలు పీఆర్సీకి అందజేశాం.