ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్.. రానున్న రెండు రోజులు జాగ్రత్త

సెల్వి

శుక్రవారం, 3 ఏప్రియల్ 2026 (09:18 IST)
ఏపీ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో రానున్న రెండు రోజులు ఎండల తీవ్రత ఎక్కువగా వుంటుందని హెచ్చరికలు జారీ చేసింది. 42 నుంచి 43 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది. 
 
ఇవాళ మొత్తం 54 రేపు 41 మండలాలలో తీవ్ర వడగాలులు, 21 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. గురువారం రోజున విజయనగరం జిల్లా రాజాంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
 
40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనాయి. ఈ క్రమంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచనలు చేసింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు