తిరుపతిలో భారీ వర్షం... కూలిన మూడంతస్తుల భవనం

మంగళవారం, 3 మార్చి 2015 (19:04 IST)
తిరుపతిలో అకాలవర్షం పెద్ద కష్టాన్నే తెచ్చిపెట్టింది.. వీధుల్లోని మురుగు కాలువలు నదుల్లా ప్రవహించాయి. దాదాపు గంటపాటు కురిసిన వర్షానికి చాలా చోట్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. ఓ మూడంతస్తుల భవనం నిలువునా కూలిపో్యింది. ప్రాణనష్టం ఏమి లేకపోయినా ఆస్తి నష్టం మాత్రం సంభవించింది. వివరాలిలా ఉన్నాయి. 
 
తిరుపతిలో మంగళవారం సాయంత్రం ఉన్నట్లుండి భారీ వర్షం కురిసింది. దాదాపు గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి మురుగు కాలువలు నదుల్లా ప్రవహించాయి. పెద్ద ఎత్తు పొంగి ప్రవహించాయి. ఉరుములు మెరుపులతో కురిసిన వర్షానికి భారీగా వర్షపునీరు ప్రవహించింది. ఇదే సమయంలో నిమ్మకాయల వీధిలోని ఓ మూడంతస్తుల భవనం కూలిపోయింది. 
 
అయితే నెర్రెల చీలే సమయంలోనే అందులోని జనమంతా బయటకు వచ్చేయడంతో ప్రాణ నష్టం ఏమి జరగలేదు. కానీ కింద అంతస్తులో ఉన్న ఓ సెల్ ఫోన్ షాపులోని మొత్తం సెళ్లులు ధ్వంసం అయినట్లు తెలుస్తోంది. మరోవైపు పై అంతస్తులలో ఉన్న వారు కట్టుబట్టలతో బయటకు వచ్చేయాల్సి వచ్చింది. 

వెబ్దునియా పై చదవండి