ఏపీలోని కృష్ణా జిల్లాలో అకాల వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల దెబ్బకు అనేక గ్రామాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, నిండు కుండలుగా మారాయి. పట్ణానికి మంచినీటిని అందించే చెరువుకు గండిపడింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు.
ఈ చెరువు తెగిపోవడంతో వంద క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా గ్రామీణ ప్రాతాల్లోకి వచ్చాయి. అలాగే, గుడివాడలోని పప్పుల చెరువుకు గండిపడింది. దీంతో భారీగా నీరు వృథాగా పోతోంది. గుడివాడ మున్సిపాలిటీకి ఇదే మంచినీటిని అందించే చెరువు కావడంతో స్థానికులతో పాటు.. అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చెరువు పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల్లోకి తాగురీతంగా వృధాగా పోయింది. మందపాడు, ఆదర్శ్ నగర్ కాలనీల్లో భారీగా నీరు వచ్చి చేరింది. దీంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అయితే, చెరువుకు గండిపడిన విషయంపై మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే విమర్శలు లేకపోలేదు.