ప్రముఖ తమిళ నటుడు జయం రవి ఇల్లు వేలానికి సిద్ధమైంది. 11 నెలల పాటు ఈఎంఐ కట్టకపోవడంతో చెన్నై, ఇంజంబాక్కంలోని ఆయన ఇంటిని ఓ ప్రైవేట్ బ్యాంకు వేలం వేయడానికి సిద్ధమైంది. తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించకపోవడంతో, బ్యాంకు అధికారులు ఆయన ఇంటికి వేలం నోటీసులు అంటించారు. ఈ ఘటన కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. జయం రవి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.