తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు..

గురువారం, 3 జూన్ 2021 (08:37 IST)
కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, శుక్రవారం తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉరుములతో కూడిన జల్లులు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీసగఢ్‌ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కి.మీ వద్ద ఏర్పడింది. గాలి విచ్ఛిన్నతి తెలుగు రాష్ట్రాలపై సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు ఉంది. 
 
మరోవైపు నైరుతి రుతు పవనాలు బలపడ్డాయి. రానున్న 24 గంటల్లో ఈ రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావారణ శాఖ ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
 
ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురిశాయి. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వర్షం పడింది. గురు, శుక్ర వారాల్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో నగరంలో వాతావరణం చల్లగా మారింది. తెలంగాణలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు