ముంబై హీరోయిన్ జెత్వానీ కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారులు పి.ఎస్.ఆర్. ఆంజనేయులు, కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
అధికారులతో పాటు, ఇబ్రహీంపట్నం మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ హనుమంతరావు, న్యాయవాది వెంకటేశ్వర్లులకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేయబడింది. ఈ ముగ్గురు ఐపీఎస్‌లను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.