హైకోర్టు, మెజిస్ట్రేట్ ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని.. ఏపీ ప్రభుత్వాన్ని న్యాయస్థానం నిలదీసింది. మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించినా.. సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు సీరియస్ అయ్యింది. రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది.
ప్రభుత్వంపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కింద నోటీసులివ్వాలని ఆదేశించింది. సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కు నోటీసులివ్వాలని ఆదేశాలు జారీచేసింది. కోర్టు ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్‌కు ఆదేశాలిచ్చింది. పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు స్పందిస్తాయని వ్యాఖ్యానించింది.