అర్హత ఉన్నప్పటికీ తమకు 'వైఎస్సార్ చేయూత' పథకం వర్తింపచేయడం లేదంటూ కృష్ణా జిల్లా చందర్లపాడు గ్రామానికి చెందిన 20 మంది ఎస్సీ, ఎస్టీ,బీసీ మహిళలు హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై బుధవారం జరిగిన విచారణకు కృష్ణా జిల్లా పూర్వ కలెక్టర్, డీఆర్‌డీఏ పీవోలు హాజరుకాలేదు. వారి తరఫు న్యాయవాదులు సైతం హాజరుకాకపోవడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వారిద్దరిపై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీచేసింది.