Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

దేవీ

శనివారం, 23 ఆగస్టు 2025 (19:36 IST)
Producer Natti Kumar
తెలుగు సినీ పరిశ్రమలో పద్దెనిమిది రోజుల సమ్మెకు ముగింపు పలకడం సంతోషకరం, ఇందుకు చొరవ తీసుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారికి, మెగాస్టార్ చిరంజీవి గార్కి, అలాగే లేబర్ కమీషనర్ గార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాదారు. 
 
సినీ కార్మికుల సమ్మె ముగియడం సంతోషకరమే అయినప్పటికీ, మా చిన్న నిర్మాతలకు, అలాగే  వివిధ సంఘాలకు చెందిన కార్మికులకు  అనేక సందేహాలు ఉన్నాయని, వాటిని తీర్చేందుకు చర్చలలో పాల్గొన్న  ఫిలిం ఛాంబర్ పెద్దలు కానీ, అటు ఫెడరేషన్ ప్రెసిడెంట్, సెక్రటరీలు కానీ ఎవరూ కనిపించడం లేదని నట్టి కుమార్ అన్నారు. 
 
ఇంకా ఆయన మాట్లాడుతూ, "మొదట్నుంచి ఫిలిం ఛాంబర్ పెద్దలకు, ఫెడరేషన్ నాయకులకు మధ్య జరిగిన చర్చలలో   5 శాతం మాత్రమే  వేతనాలు పెంచగలమని చెబుతూ వచ్చారు. అందుకు కార్మికులు ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో షూటింగులు నిలిచి పోవడంతో  ఈ సమస్యను పరిష్కరించమని  సినీ పెద్దగా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరకు మా చిన్న నిర్మాతలతో పాటు పెద్ద నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులు అందరూ వేర్వేరు గా వెళ్లి కలిశారు. అందుకు చిరంజీవి గారు పెద్ద మనసుతో అంగీకరించి... నా సినీ పరిశ్రమలోని వారు పెద్దా, చిన్నా అంతా బావుండాలని అందరితో  ఆయన చర్చలు జరిపారు. 
 
 అదే సమయంలో తెలంగాణ  ప్రభుత్వం  జోక్యం చేసుకోవడం, సమస్య పరిష్కారానికి పూనుకోవడం  సంతోషదాయకం. అయితే లేబర్ కమీషనర్ దగ్గర ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఫెడరేషన్ నాయకుల మధ్యన కుదిరిన ఒప్పందంలో కొన్ని అంశాలు మాకు అంగీకారం కాదని సినీ కార్మికులు అంటున్నారు. ఫెడరేషన్ నాయకులు మాకు చెప్పకుండా, మా ప్రమేయం లేకుండా సంతకాలు పెట్టడం అభ్యంతరకరమని వారు విమర్శిస్తున్నారు. 
 
మొదలవుతాని అనుకున్న షూటింగులు ఇంకా మొదలు కాలేదు..  మరోవైపు ప్రభుత్వ చర్చలు పూర్తయిన సందర్భంగా. అంతకముందు  సమస్య పరిష్కారానికి మూడు రోజుల సమయం వెచ్చించి అందరి సమస్యలను విని, ఆమోదమైన పరిష్కార మార్గానికి కృషి చేసిన  మెగాస్టార్ చిరంజీవి గార్కి,ఛాంబర్ నాయకులు కానీ ఫెడరేషన్ నాయకులు కానీ కనీస కృతజ్ఞతలు చెప్పకపోవడం నాకు చాలా బాధాకరమనిపించింది. వా దృష్టిలో కృతజ్ఞతను మరచిపోవడం కరెక్ట్ కాదు.
 
 ఈ విషయాన్ని దిల్ రాజు, కిరణ్, సుప్రియ వంటి వారు, అలాగే ఫెడరేషన్ నాయకులు అనిల్, అమ్మిరాజు తదితరులు ఆలోచించాలి. ఈ అంశంలో చిరంజీవి గారు నన్ను తిట్టినా సరే నా అభిప్రాయం సూటిగా చెబుతునాన్రు. రాజకీయాలలో ఇలాంటివి జరగవచ్చునేమో కానీ సినీ పరిశ్రమలో కూడా అంతకన్నా ఎక్కువ రాజకీయాలు ఉంటాయని అర్ధమవుతోంది. ఇప్పటికైనా చిన్నా, పెద్దా నిర్మాతలు, అలాగే సినీ కార్మికులు అందరూ బావుండాలన్నదే నా ఉద్దేశ్యం కూడా. అయితే ఎలాంటి అరమరికలు లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంతోనే సంతోకరంగా షూటింగులు మొదలు కావాలన్నదే నా అభిప్రాయం.. 
 
ఇక తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలలో చిన్న సినిమాలకు 5వ ఆట, అనగా మధ్యాహ్నం రెండున్నర  గంటల షోను శాశ్వతంగా కేటాయించాలి. అలాగే మల్టీ ఫ్లెక్స్ లలో 20 శాతం సీట్లను టిక్కెట్  ధర 100 రూపాయలుగా నిర్ణయించాలి. చిన్న సినిమాల వల్ల పరిశ్రమలో కార్మికులకు ఎప్పుడూ పని దొరుకుతూనే ఉంటుంది. అందుకే చిన్న సినిమాను బతికించాలి. ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం, రాజమండ్రి, అమరావతి, తిరుపతి తదితర ప్రాంతాలలో స్టూడియోలు నిర్మించాలి. తెలంగాణతో పాటు అక్కడ కూడా షూటింగులు విరివిగా జరగాలి" అంటూ ముగించారు. 
ఈ ప్రెస్ మీట్లో మరో నిర్మాత సదానంద్ గౌడ్ కూడా పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు