భక్తుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత: దేవాదాయ శాఖ

శనివారం, 25 జులై 2020 (09:58 IST)
కరోనా కారణంగా ఆల‌యంలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయించిన త‌రువాతనే భ‌క్తుల‌కు అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌ని భ‌క్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ద‌ర్శ‌న‌లు చేసుకోవ‌చ్చున‌ని, ప్ర‌తి భ‌క్తుడు వి.ఐ.పినే అని దేవాదాయ ధ‌ర్మ‌దాయ శాఖ ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్ పి.అర్జ‌నరావు పేర్కొన్నారు.
 
ఈ మేర‌కు దేవాదాయ ధ‌ర్మ‌దాయ శాఖ క‌మిష‌న‌ర్‌ కార్యాల‌యం నుంచి ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. కేంద్ర‌, రాఫ్ట్రాల నిభంద‌న‌ల‌ను అనుస‌రించి ఆల‌యంలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేయించిన త‌రువాతనే భ‌క్తుల‌కు అనుమ‌తించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. 
 
కోవిడ్ నియమ నిబంధనలను పాఠించుచూ భక్తులకు దైవదర్శనము ఏర్పాటు చేస్తున్న‌ట్లు తెలిపారు. భ‌క్తులు మైరుగైన సేవ‌లందించేందుకు కృషి చేస్తామన్నారు. 
 
క‌రోనా నివార‌ణ‌కు అన్ని దేవాల‌యాల్లో యధావిధిగా యజ్ఞాలు, హోమాలు, నిత్య పూజలు మరియు కైంకర్యాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. 65 ఏళ్లకు పైబడిన వయసువారు, ఇతరత్రా రుగ్మతలు ఉన్నవారు, గర్భిణీలు, 10 ఏళ్లలోపు పిల్లలు ఆలయాలకు రాక‌పోవ‌డం మంచిదన్నారు.
 
ఇందుకు అనుగుణంగా ఆలయాల‌కు వ‌చ్చు భక్తులకు సూచనలు, విస్త్ర‌తంగా ప్ర‌చారం చేయాల‌ని  అధికారుల‌కు ప్ర‌త్యేక క‌మిష‌న‌ర్‌ అర్జ‌నరావు అదేశించారు. భక్తులు దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్నపుడు కనీసం ఆరడుగుల సామాజిక‌ దూరం తప్పకుండా పాటించాల‌న్నారు. ఇందుకోసం  అన్ని ఆల‌యాల్లో మార్కింగ్స్ వేయ‌డం జ‌రిగింద‌న్నారు. 
 
ఫేస్ కవర్స్ లేదా మాస్కులు ఉన్నవారిని మాత్రమే లోనికి అనుమతించాల‌న్నారు. భక్తులు, సందర్శకులు వదిలి వెళ్లిన ఫేస్ కవర్లు, మాస్కులు, చేతి కవర్లను సరైన పద్దతిలో పారవేయడానికి ప్రత్యేక శిక్ష‌ణ క‌ల్గిన‌ సిబ్బందిని నియమించాలని అధికారుల‌కు సూచించారు.
 
భక్తులు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అనారోగ్యకరమైన లక్షణాలు కనిపించినా వెంటనే జిల్లా హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేయాలన్నారు. భక్తులందరికీ ఆరోగ్యసేతు యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలని సూచించారు. ఆలయంలో దేవతామూర్తులను, పవిత్ర గ్రంథాలను తాకకూడదన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు