ఈ సందర్భంగా రాష్ట్రస్థాయి అధికారులు సిద్ధం చేసిన పీఎంఏవై గృహాలకు సంబంధించిన డీపీఆర్ కు సీఎస్ ఆమోదం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం 3,70,255 పీఎంఏవై (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) గృహాల మంజూరుకు సంబంధించిన డీపీఆర్ పై సీఎస్ చర్చించిన అనంతరం ఆమోదం తెలిపారు.
గృహాల మంజూరుకు డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వం కు పంపించనున్నారు. గృహాల మంజూరుకు సంబంధించి ఏర్పాటైన స్టేట్ లెవల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీలో సీఎస్ తో పాటు పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ, హౌసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ, రెవెన్యూ (ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సెక్రటరీ, ఏపిటిడ్కో ఎండీ ఉన్నారు.
ఈ సమావేశంలో గృహనిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజైయ్ జైన్, పురపాలక పరిపాలన కార్యదర్శి శ్యామలారావు, ల్యాండ్ ఎండోమెంట్స్ కార్యదర్శి ఉషారాణి, ఏపీటిడ్కో ఎండీ మైదీన్ సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.