ఎన్టీఆర్ జిల్లాలో హానీ ట్రాప్ మోసం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా, తిరువూరులో ఓ బాధితుడి నుంచి ఓ మహిళ ఉంగరం, రూ.5వేల నగదు కాజేసింది. అంతేగాకుండా.. రూ.2లక్షలు డిమాండ్ చేసిందని వెలుగులోకి వచ్చింది. హనీట్రాప్ మోసాలకు గురైన బాధితులు పరువుపోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకడుగు వేస్తుంటారు. కానీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన బాధితుడు మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలైన మహిళను అరెస్ట్ చేశారు.
డబ్బులు, బంగారం కాజేసింది కాకుండా.. రెండు లక్షలు డిమాండ్ చేసింది. అలా ఇవ్వకుంటే అత్యాచారం కేసు పెడతానని బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ కేసులో రేణుకతో పాటు మరొక వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోంది.