జీతం రాగానే బడ్జెట్ రెడీ చేసేయండి.. లేకుండే డబ్బుతో ప్రమాదమే!

శనివారం, 25 అక్టోబరు 2014 (17:13 IST)
జీతం రాగానే బడ్జెట్ రూపొందించుకోవడం ఉత్తమమని లేకుంటే డబ్బుతో ప్రమాదమేనని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బు విషయంలో తగిన జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని వారు వార్నింగ్ ఇస్తున్నారు. 
 
మిత్రులు, దంపతుల మధ్య దంపతుల మధ్య డబ్బు విషయంలో భేదాభిప్రాయాలు రాకుండా ఉండాలంటే.. ఇద్దరూ కూర్చుని ఓ బడ్జెట్ రూపొందించుకోవాలి. ఎంత దాచుకోవాలి? ఎంత ఖర్చు చేయాలి? అన్న విషయమై ఓ అవగాహనకు రావాలి. 
 
భవిష్యత్తుకు సంబంధించి కొన్ని లక్ష్యాలను పెట్టుకోవాలి. ఎవరికివారు లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా, ఉమ్మడి లక్ష్యం కోసం పాటుపడాలి. అంతేగాకుండా, ఓ ఇల్లు కొంటున్నా, ఓ కారు కొంటున్నా గానీ... భాగస్వామి సలహా ముఖ్యమన్న మరిచిపోకూడదు. ఇలాంటి సమష్టి నిర్ణయాలు భవిష్యత్తులో ఎంతో మేలు చేస్తాయి. 
 
జీతం రాగానే బడ్జెట్ రూపొందించుకోవడం.. ఎవరి జీతం దేనికి ఖర్చు చేయాలి? ఎవరి జీతంలో ఎంత ఆదా చేయాలి? అనే విషయంపై స్పష్టత ఉంటే ఎంతో మేలు జరుగుతుంది.

వెబ్దునియా పై చదవండి