భార్య ప్రవర్తనపై అనుమానం.. రోకలి బండకు మోది హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

శనివారం, 3 సెప్టెంబరు 2016 (09:04 IST)
భార్య ప్రవర్తనపై అనుమానంతో భర్త భార్య ప్రాణాలు తీసిన ఘటన గుంటూరులో చోటుచేసుకుంది. ఈ ఘటనలో భర్తే నిందితుడని తేలడంతో నిందితునికి జీవిత ఖైదు, రెండు వేల రూపాయల జరిమానా విధిస్తూ గుంటూరు 3వ అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి ఎన్‌ సత్యశ్రీ శుక్రవారం తీర్పిచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే.. నిరంతరావు (60) రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి భార్య పిచ్చమ్మ (58) తోపాటు నలుగురు పిల్లలు. సంఘటనకు నెల రోజుల ముందు నుంచి భార్య ప్రవర్తనపై నిరంతరరావుకు అనుమానం ఏర్పడింది. ఆమె తనతోటి రిక్షా కార్మికునితో చనువుగా ఉండటం గమనించాడు.
 
2014 అక్టోబర్‌ 13న అర్థరాత్రి నిద్రిస్తున్న భార్య పిచ్చమ్మ తలపై రోకలి బండతో మోది హత్య చేశాడు. తండ్రి తమ తల్లిని చంపడం పిల్లలు చూశారు. ఈ ఘటనపై పెదకాకాని పోలీసులు కేసు నమోదు చేయగా సీఐ కె శేషారావు దర్యాప్తు జరిపి కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశారు.  

వెబ్దునియా పై చదవండి