నగరంలోని అంబర్ పేటలో ఓ గదిలో ఉంటున్నాడు. రూమ్ నుంచి మంగళవారం ఉదయం వెళ్లిన నిఖిల్ తిరిగిరాకపోవడంతో అతడి స్నేహితులు, తమ్ముడు ఆ రూమ్‌కు వెళ్లి చూశారు. నిఖిల్ తన ల్యాప్‌టాప్‌లో సూసైడ్ లెటర్ రాసినట్లు గమనించారు.
ఈ లెటర్లో నిఖిల్ తల్లిదండ్రులకు సారీ చెప్పాడు. తల్లిదండ్రులను తమ్ముడు బాగా చూసుకోవాలని సూచించాడు. ఇక తనకు బతకాలని లేదని రాశాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న నిఖిల్ తల్లితండ్రులు తమ పెద్ద కుమారుడి కోసం ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఆ ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.