వివరాలలోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా పటాన్ చెరుకి చెందిన భాను అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మెరుగైన వైద్యం కోసం అతని కుటుంబ సభ్యులు అతడిని గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఆ యువకుడికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చనిపోయినట్లు నిర్ధారించి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సమాచారం ఇవ్వమని కుటుంబ సభ్యులకు చెప్పా.
పోలీసులకు సమాచారం అందించిన తర్వాతనే పోస్టుమార్టం నిర్వహిస్తామని స్పష్టంచేశారు. అయితే పోలీస్ స్టేషన్‌కు వెళ్లడం, పోలీసులు రావడం.. వీటన్నింటికీ సమయం తీసుకోవడంతో డ్యూటీ డాక్టర్ తన టైమ్ అయిపోయిందని వెళ్లిపోయి వేరొక డాక్టర్ రావడంతో వచ్చిన డాక్టర్ భాను పరిస్థితిని గమనించి.. అతడు ఇంకా ప్రాణాలతో ఉన్నట్లు నిర్ధారించి వెంటనే చికిత్స అందించడంతో భాను ప్రాణాలతో బయటపడ్డాడు.