చాలా మంది పురుషులకు శీఘ్ర స్ఖలన సమస్య ఉంటుంది. కానీ ఈ విషయాన్ని వారు ఎక్కడా కూడా బయటకు చెప్పుకోలేరు. కొత్తగా పెళ్లయిన వరుడు అయితే ఈ సమస్య ఉన్నట్టయితే భార్యను సంతృప్తి పరచలేక మానసికంగా కుంగిపోతుంటాడు. పైగా, ఈ సమస్యకు వైద్యులను కలిసి చికిత్స తీసుకోమనీ భార్య బలవంత పెడుతోంది. ఏం చేయాలి? అసలు ఎంత సమయంలోగా స్ఖలనమైతే శీఘ్రస్ఖలనంగా భావించాలి?
సాధారణంగా లైంగిక చర్యలో ఐదు నుంచి ఐదున్నర నిమిషాల నిడివి తర్వాత స్ఖలనం జరగాలి. ఇది కనీస సమయం. అలా కాకుండా అంగప్రవేశం జరిగిన నిమిషంలోగానే స్ఖలనం జరిగిపోతే దాన్ని శీఘ్రస్ఖలనంగా భావించాలి. దీన్నే ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు. స్ఖలన సమయం దంపతులిద్దరినీ అసంతృప్తికిలోను చేస్తుంటే దాన్ని సమస్యగానే భావించాలి.
* ప్రైమరీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కు ప్రధాన కారణం మానసికంగా ఉంటాయి.
* సెకండరీ ప్రిమెచ్యూర్ ఎజాక్యులేషన్. ఇందులో అంతకుముందు వరకూ లేకుండా కొత్తగా శీఘ్రస్ఖలన సమస్య తలెత్తుతుంది.