మద్యం తాగొద్దన్న భర్త... ఊహించని షాకిచ్చిన భార్య

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (14:06 IST)
సాధారణంగా తాగుడుకు బానిసలైన భర్తలను మందలించే భార్యలు ఉంటారు. అయితే ఇక్కడ తాగుడుకు బానిసైన భార్యను భర్త మందలించగా ఆమె ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో జరిగింది.
 
ఉత్తరప్రదేశ్ కడక్‌పూర్‌కు చెందిన నాగవెల్లి లక్ష్మి, సికింద్రాబాద్ బోయినపల్లిలో నివాసం ఉండే రాము ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు కూడా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా లక్ష్మి మద్యానికి బానిసైంది. దీన్ని గమనించిన భర్త రాము మద్యం తాగవద్దని మందలించేవాడు.
 
అయితే భర్త మాటలను లెక్క చేయని లక్ష్మి ప్రతి రోజూ తాగేది. ప్రతిరోజూ రాత్రి తన కొడుకుతో మద్యం తెప్పించుకుని మరీ తాగేది. గత శనివారం నాడు కూడా అలాగే చేయడంతో భర్త రాము ఆమెను గట్టిగా మందలించాడు. దీనితో మనస్తాపానికి గురై ఆ మహిళ ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు