గత ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలకు పవన్ కల్యాణ్ మద్దతు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అశోక్ గజపతి అనడం సంచలనంగా మారింది. ఈ మేరకు అశోక గజపతిరాజు చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
కాగా, టీడీపీ పాలనతో పాటు ఆ పార్టీ నేతలు చేస్తున్న తప్పొప్పులపై పవన్ కళ్యాణ్ నిలదీస్తున్న విషయం తెల్సిందే. తాజాగా, తితిదే కొత్త ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకంపై కూడా పవన్ ఏపీ సర్కారును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో మంత్రి గజపతి రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.