చంద్రబాబు ముస్లింలకు వరాలిస్తే, జగన్ చావులు, దాడులు ఇస్తున్నాడు: నాగుల్ మీరా
శనివారం, 28 నవంబరు 2020 (07:17 IST)
రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలను చూస్తుంటే, శాంతిభద్రతలు మచ్చుకైనాలేవని స్పష్టమవుతోందని, ముస్లిం మైనారిటీలపై వరుసగా దాడులుజరుగుతున్నా కూడా ప్రభుత్వం బాధితులనే వేధిస్తూ, తప్పుచేసిన వారిని రక్షిస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్ మీరా స్పష్టంచేశారు.
ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాజమండ్రి సమీపంలోని బొమ్మూరులో అబ్దుల్ సత్తార్ కుటుంబంగానీ, నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం, రైలుకిందపడి ఆత్మహత్య చేసుకోవడంగానీ, నేడు ఆ ఘటనల కన్నా దారుణంగా మరోసంఘటన జరగడం తనను తీవ్రంగా కలచివేసిందని వాపోయారు.
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో రఘ అనే వైసీపీకార్యకర్త షాహెదాబేగం ( 19 ) అనే యువతిని దారుణంగా వేధించాడన్నారు. వారిద్దరూ ఇష్టపడినా, ఇరుకుటుంబాలకు మధ్యన పెద్దలు పంచాయతీచేసి, ఎవరి పరిధిలో వారుండాలని సూచించడం జరిగిందని, దానిలో భాగంగా, 22వతేదీన షాహెదాబేగంకు వివాహం నిశ్చయించడం జరిగిందని తెలిపారు.
సదరు యువతి మరొకరిని పెళ్లిచేసుకోవడాన్ని జీర్ణించుకోలేని రఘు, ఆ అమ్మాయిని అతని తో పాటు తనఊరికి తీసుకెళ్లి, తనస్నేహితులతో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడి, చివరకు సదరు యువతిని చెరువులో పడేయడం జరిగిందన్నారు. ఇటువంటి దారుణాలు, దాష్టీకాలు జరుగుతున్నా కూడా ప్రభుత్వం చోద్యంచూస్తూ ఊరుకోవడం ఎంతటి సిగ్గుచేటో ప్రజలే ఆలోచించాలని నాగుల్ మీరా సూచించారు.
15వ తేదీన సదరు యువతి కనిపించకుండాపోయిందని, ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేస్తే, 23 వతేదీవరకు వారు ఆమె ఆచూకీని ఎందుకు కనుక్కోలేకపోయారని టీడీపీ నేత నిలదీశారు. 22వతేదీన పెళ్లిచేసుకోవాల్సిన యువతి, 23వతేదీన చెరువులో శవమై తేలినా, ప్రభుత్వంగానీ, పోలీసులు గానీ స్పందించకపోవడం ఎంతటిదారుణమో, ఎంతటి అమానుషమో ప్రజలే ఆలోచించాలన్నారు.
ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన యువతిని, వైసీపీ కార్యకర్త అయిన రఘు, పెళ్లిపీఠలపై కూర్చోకుండా ఖబరస్తాన్ కు చేర్చాడని, అంతటి దురాగతానికి పాల్పడిన అతను, అతని స్నేహితులపై చర్యలు తీసుకోకపోవడం ఏంటన్నారు? యువతి తల్లిదండ్రులు రఘుఅనేవ్యక్తిపై అనుమానం ఉందని, పోలీసులకు చెప్పినా, వారు ఆ దిశగా విచారణ జరపలేద న్నారు.
జరిగిన ఘటనకు కారకులైనవారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా, తూతూమంత్రంగా యువతి మృతదేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించి, ఆమె పార్థివదేహాన్ని పోలీసులు తల్లిదండ్రు లకు అప్పగించారన్నారు. జరిగింది చాలా దారుణమైనసంఘటన అయితే, కేసుదర్యాప్తుగానీ, మృతదేహానికి నిర్వహించిన పోస్ట్ మార్టమ్ గానీ తూతూమంత్రంగా నిర్వహించడమేంటని పోలీసులను నిలదీశారు.
ఇంతటిదారుణం కళ్లముందు జరిగినాకూడా, ప్రభుత్వం ఎప్పటిలానే దోషులనుఅరెస్ట్ చేశామం టూ, పాతపాటే పాడుతోందన్నారు. అధికారపార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ఆంబోతుల్లా ఆడబిడ్డలపై పడి, వారిని బలితీసుకుంటున్నాకూడా రాష్ట్రప్రభుత్వం ఏమీ జరగనట్టే ఉదాసీనంగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ వైఖరి చూస్తుంటే, అధికారపార్టీకి చెందిన దుర్మార్గులకు లైసెన్స్ ఇచ్చిమరీ రాష్ట్రంపైకి వదిలేసినట్టుగా అనిపిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
అధికారపార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి, ఇతరులకు మరోన్యాయం అమలవడం ఈరాష్ట్రంలోనే చూస్తున్నా మన్నారు. రాష్ట్రంలోని ముస్లిం మైనారిటీలు, ముస్లిం సంఘాల వారు ప్రభుత్వ తీరుపై ఆలోచనచేయాలని, మైనారిటీలకు జరుగుతున్న అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
తిరుపతి ఉపఎన్నికతోనే ప్రభుత్వపతనం మొదలవుతుందని, ముస్లింసమాజం తమను ఏమీచేయడంలేదని భావిస్తున్న ప్రభుత్వానికి, తగినవిధంగా బుద్ధిచెప్పడానికి, సదరు సమాజం సిద్ధంగా ఉందని టీడీపీనేత తేల్చిచెప్పారు.
ముస్లిం మైనారిటీలపై దాడులు, అత్యాచారాలు జరుగుతున్నా, వారు అమానుషంగా చంపబడుతున్నా, ముఖ్యమంత్రికి చీమకుట్టినట్టు కూడాలేదన్నారు. అటువంటి ముఖ్యమంత్రికి తగినవిధంగా బుద్ధి చెప్పాలన్న ఆలోచనలో ముస్లింసోదరులు ఉన్నారని నాగుల్ మీరా స్పష్టంచేశారు. విజయవాడలో ఇంట్లోకి చొరబడిమరీ ఒకదళితయువతి పీకకోసి దారుణంగా చంపేశారని, ఆఘటనలో కూడా ప్రభుత్వం దోషులపై చర్యలు తీసుకోలేకపోయిందన్నారు.
రాయచోటిలో ముస్లిం మహిళ, ప్రభుత్వాన్ని ప్రశ్నించిందన్న అక్కకసుతో ఆమెపై దేశద్రోహం కేసు పెట్టడం జరిగిందన్నారు. గుంటూరుజిల్లా సత్తైనపల్లిలో మెడికల్ షాపుకు వెళ్లిన యువకుడిని పోలీసులు అకారణంగా కొట్టిచంపేయడం జరిగిందన్నారు. నిన్నగాక మొన్న తాడికొండసమీపంలోని ఖబరస్తాన్ లో మట్టి తవ్వకాలను అడ్డుకున్నందుకు, వైసీపీకార్యకర్తలే మసీదు ఇమామ్ పై దాడిచేసినఘటనను రాష్ట్రమంతా చూసిందన్నారు.
ఈ విధంగా వరుసగా ఆకృత్యాలు, అరాచకాలు జరుగుతున్నా పాలకులు చోద్యంచూస్తున్నారని నాగుల్ మీరా మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, పాలకులను ప్రశ్నించారన్న అక్కసుతో, అమాయకైన వారిని వేటాడి, వెంటాడి పట్టుకుంటున్న పోలీసులు, కళ్యాణదుర్గంలో ముస్లిం యువతిని దారుణంగా అత్యాచారం చంపేసినవారిని ఫిర్యాదు ఇచ్చిన 5రోజులవరకు పట్టుకోలేక పోయారన్నారు.
బొమ్మూరులో అబ్దుల్ సత్తార్ కుటుంబాన్ని వేధించిన వారిపై చర్యలు తీసుకొనిఉంటే, నంద్యాలలో సలాం కుటుంబం అకారణంగా బలైపోయేది కాదని, అదేవిధంగా సలాం కుటుంబం ఆత్మహత్యకు కారకులైన వారిని దారుణంగా శిక్షించి ఉంటే, నేడు కళ్యాణదుర్గంలో ముస్లింయువతి షాహెదా బేగం మృతదేహం చెరువులో తేలేది కాదని స్పష్టంచేశారు.
ప్రభుత్వ ఉదాసీనత, నిర్లక్ష్యం కారణంగానే వైసీపీకార్యకర్తలు, నేతలు ఆడబిడ్డలపై పడి వారిని, వారి కుటుంబాలను బలితీసుకుం టున్నారని నాగుల్ మీరా ధ్వజమెత్తారు. నేడు, ఈ ప్రభుత్వంలో ఆడబిడ్డలు బయటకు రావాలంటేనే భయమేస్తోందని, ప్రభుతాన్ని ప్రశ్నించాలన్నా, నిలదీయాలన్న కూడా అదేవిధమైన భయాందో ళనతో ప్రజలున్నారన్నారు.
ఈ విధంగా ప్రజలను భయపెట్టి, నిరంకుశంగా, నియంత్రత్వంగా పాలనచేస్తే, ప్రజలు సహించరనే నిజాన్ని జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటే మంచిదన్నారు. ప్రజలను భయపెట్టి, బెదిరించి చేసేది పాలనేకాదని, అటువంటిపాలన ఎక్కువకాలం సాగదని నాగుల్ మీరా తేల్చిచెప్పారు. టీడీపీ హాయాంలో ఇటువంటిదారుణాలు ఎక్కడా జరిగిందిలేదని, ఎక్కడైనా జరిగినా, నిందితులను శిక్షించడంలో ఆయన వెనకా ముందు ఆలోచించకుండా చర్యలు తీసుకున్నాడని తెలిపారు.
చంద్రబాబునాయుడి ప్రభుత్వం మైనారిటీలకు వరాలు ఇస్తే, జగన్ ప్రభుత్వం ఆయావర్గాలకు చావులు, ఆత్మహత్యలు, అత్యాచారాలను కానుకగా ఇచ్చిందన్నారు. తనకు ఓట్లిసి గెలిపించిందుకు మైనారిటీలపై జగన్ ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నాడని, ఎన్నడూలేనివిధంగా మైనారిటీలపై జగన్ నాయకత్వంలోనే దాడులు జరుగుతున్నాయని వాపోయారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని, పాదయాత్రలో జగన్ కోరినట్లుగా, ఆయనకు ఒక్కఛాన్స్ ఇచ్చారని, అదే ఆఖరిఛాన్స్ అయ్యేలా ఆయన పాలన సాగుతోందన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నా, ప్రజలు ఛీత్కరిస్తున్నా కూడా పట్టించుకో కుండా, ప్రభుత్వం దున్నపోతుపై వానకురిసినట్టుగా వ్యవహరిస్తోం దన్నారు.
షాహెదా బేగం హాత్యాచారఘటనపై, నూటికి నూరుశాతం న్యాయవిచారణ జరిపించాలని, దోషులు ఎవరైనా సరే వారిని కఠినంగా శిక్షించాలని నాగుల్ మీరా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతి హత్య, అత్యాచారం ఘటనలో జగన్ నిందితులను శిక్షించి, సదరు యువతి కుటుంబానికి అండగా నిలవకుంటే, ప్రభుత్వానికి తగినవిధంగా బుద్ధిచెప్పడానికి మైనారిటీ సమాజం సిద్ధంగా ఉందన్నారు.
కళ్యాణదుర్గంలో మైనారిటీ వర్గీయులంతా ఇప్పటికే ఆందోళన చేస్తున్నారని, దీనిపై జగన్మోహన్ రెడ్డి తక్షణమే స్పందించాలని నాగుల్ మీరా డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రిగానీ, ప్రభుత్వంలో ఉన్న మైనారిటీనేతలు గానీ, మైనారిటీలపై జరుగుతున్నదాడులపై స్పందించకపోవడం దారుణమన్నారు.
మైనారిటీవర్గానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇచ్చానని చెప్పిన ముఖ్యమంత్రి, ఆయావర్గాలకు రక్షణకల్పించలే నప్పుడు ఎన్నిపదవులు ఉండి మాత్రం ఉపయోగం ఏముంటుందని నాగుల్ మీరా వాపోయారు. వైసీపీప్రభుత్వం ఏ బలహీనవర్గం పక్షానలేదని జరుగుతున్న ఘటనలే చెబుతున్నాయన్నారు.
హైదరాబాద్ లో జరుగుతున్న జీహెచ్ ఎంసీ ఎన్నికల కోసం, అసదుద్దీన్ ఓ.వై.సీ పిచ్చిప్రేలాపనలు చేశాడన్నారు. దేశం గర్వించదగ్గ నేత అయిన ఎన్టీఆర్ సమాధిపై ఒక్క గునపం పడితే, ఎంఐఎం పార్టీనేతలపై వందగునపాలు దిగడంఖాయమని నాగుల్ మీరా హెచ్చరించారు. బావిలోకప్పలా పాతబస్తీ దాటి బయటకు రాని ఎంఐఎంపార్టీ, దిగజారుడు రాజకీయాలు చేస్తోందన్నారు.
పాతబస్తీని ఎప్పటికీ పాతబస్తీలానేఉంచి, అక్కడివారి అభివృద్ధి గురించి ఏమాత్రం ఆలోచన చేయని ఏకైకపార్టీ ఎంఐఎం ఒక్కటే నన్నారు. అసదుద్దీన్ గానీ, ఆయన తండ్రిగానీ ఏనాడూ మైనారిటీల సంక్షేమం గురించి ఆలోచించిందిలేదన్నారు. మైనారిటీలు రాజకీయంగా, ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచనచేసి, వారికోసం ప్రత్యేకంగా మైనారిటీ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన మహా నాయకుడు స్వర్గీయ ఎన్టీఆర్ అని స్పష్టంచేశారు.
వక్ఫ్ బోర్డుని ప్రక్షాళనచేసి, వక్ఫ్ భూములను కాపాడిన వ్యక్తి ఎన్టీఆర్ ఒక్కడేనన్నారు. రాజకీయ కురువృద్దుడైన ఎన్జీ రంగాపై, లాల్ జాన్ భాషాను గెలిపించిన పార్టీ టీడీపీ ఒక్కటేనన్నారు. పదికోట్ల మంది తెలుగుప్రజల హృదయాలను గాయపరిచేలా అసదుద్దీన్ మాట్లాడాడని, అతనికి సరైనవిధంగా గుణపాఠంచెప్పి తీరుతామని హెచ్చరించారు.
మహోన్నత వ్యక్తిని దూషించేబదులు, మైనారిటీలకు ఎలా న్యాయం చేయాలన్న దానిపై అసదుద్దీన్ ఆలోచనలు చేస్తే మంచిదన్నారు. ఎన్టీఆర్ పేరుని తనరాజకీయాలకోసం వాడుకునే అర్హత అసదుద్దీన్ కు లేదని తేల్చిచెప్పారు