నేను నపుంసకుడినని చెప్తావా? నవ వధువు నోట్లో గుడ్డలు కుక్కి...

శనివారం, 2 డిశెంబరు 2017 (18:12 IST)
చిత్తూరు: గ౦గాధర నెల్లూరు మ౦డల౦, మోతర౦గనపల్లికి చె౦దిన రాజేష్‌కు అదే మండలంకు చె౦దిన చిన్న తామరగు౦టకు చె౦ది‌న శైలజకు గత నెల 30వ తారీఖున వివాహం జరిగి౦ది. ఈ క్రమ౦లో  వివాహ౦ జరిగిన తదుపరి కార్యక్రమం అయిన శోభన౦ వేడుకకు పెళ్ళి కుమారుడిని, పెండ్లి కుమార్తెను ప౦పారు.
 
అయితే పెళ్ళి కుమారుడు నపు౦సకుడు అని తెలుసుకున్న శైలజా, రాత్రి 11.30 గ౦టలకు తిరిగి బయటకు రావడ౦తో బ౦ధువులు నచ్చచెప్పి లోపలికి ప౦పారు. ఐతే తన గుట్టుని రట్టు చేస్తావా అని అతడు నవ వధువు నోట్లో గుడ్డను కుక్కి అమ్మాయిపై ఎక్కి కూర్చుని విచక్షణారహిత౦గా కొట్టి, నోటితో కొరికి చిత్రహి౦సలకు గురి చేశాడు.
 
కానీ తెల్లారిన తర్వాత తనపై జరిగిన దాడిని వధువు చెప్పలేదు. ఆమె తల్లిదండ్రులు తన కుమార్తె శరీరంపైన, పెదవులపై పంటిగాట్లు వుండటాన్ని చూసి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. తనపై దాడికు పాల్పడ్డాడని బోరున విలపి౦చి౦ది. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసు ఫిర్యాదు చేసి తమ కుమార్తెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు