బీజేపీ అధికారంలోకి వచ్చాక ఒక్క ప్రభుత్వరంగా సంస్థ ఏర్పాటు కాలేదని ఏపీ విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ విమర్శించింది. మోదీ ప్రభుత్వం తెచ్చిన వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.
ప్రైవేట్ పాఠశాలల్లో కరోనా నిబంధనలు లేవని... విద్యార్థుల ప్రాణాలకంటే పాఠాలు ఎక్కువ కాదని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ఆన్‌లైన్‌లో క్లాసులు జరపాలని విద్యార్థి, యువజన సంఘాల ఐక్యకార్యచరణ కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.