ఎయిర్ ఇండియా విమానయాన సంస్థ సీనియర్ అధికారితో దురుసుగా ప్రవర్తించి మహారాష్ట్ర శివసేన ఎంపీపై నిషేధం విధించి సరిగ్గా మూడు నెలలైనా కాలేదు. మళ్లీ తనకు పోటీగా తయారైన తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై విమానయాన సంస్థలు నిషేధం విధించడం సంచలనం కలిగిస్తోంది. విశాఖపట్నం విమానాశ్రయంలో సంస్థ ఉద్యోగిని వెనుకనుంచి పరుగెత్తుకుంటూ వెళ్లిన దివాకర్ రెడ్డి మొరటుగా ముందుకు తోయటం సీసీ కెమెరాల్లో రికార్డవడంతో టీడీపీ ఎంపీ అడ్డంగా బుక్కయ్యారు. విషయం తెలిసిన వెంటనే ఎయిర్ ఇండియా, ఇండిగో విమానయాన సంస్థలు దివాకర్ రెడ్డిని ఇకపై తమ విమానాల్లో అనుమతించబోమని తేల్చి చెప్పేశాయి.
వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో ఇండిగో విమాన సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినందుకు టిడిపి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డిపై ఇండిగో, ఎయిర్ ఇండియా నిషేధం విధించాయి. జేసీని తమ విమానాల్లో అనుమతించబోమని తేల్చి చెప్పాయి. బోర్డింగ్ పాస్ ఇవ్వనందుకు జేసీ వైజాగ్ ఎయిర్‌పోర్ట్‌లో సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఎయిర్‌పోర్ట్‌కు ఆలస్యంగా రావడంతో సమయం ముగిసిందని, బోర్డింగ్ పాస్ ఇవ్వలేమని విమాన సిబ్బంది చెప్పారు.