ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 5,42,381 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాశారు. ఈ ఫలితాల్లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. 77 శాతంతో ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నెల్లూరు జిల్లా, 76 శాతం ఉత్తీర్ణతతో మూడో స్థానంలో గుంటూరు జిల్లాలు నిలిచాయి. 59 శాతం ఉత్తీర్ణతతో కడప జిల్లా చివరి స్థానంలో నిలిచింది.
ఇకపోతే.. ఎంపీసీలో 992 మార్కులతో మొదటి స్థానంలో విద్యార్థి కూనం తేజ వర్ధనరెడ్డి నిలవగా, రెండో స్థానంలో 991 మార్కులతో ఆఫ్రాన్ షేక్, మూడో స్థానంలో 990 మార్కులతో వాయలపల్లి సుష్మా నిలిచారు. కొద్దిసేపటి క్రితం ఏపీ విద్యాశాఖ గ్రూపులువారిగీ టాప్ టెన్ మార్కులు సాధించిన విద్యార్థుల జాబితా విడుదల చేసింది. ఈ జాబితా మీకోసం...