కానీ కొందరు దళారులు మేము మీకు పింఛన్లు రావడానికి సహాయం చేసామనే నెపంతో ఒక్కొక్కరి దగ్గర సుమారుగా రూ. 1250/- వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మాట ఆనోటా ఈనోట పొక్కి విషయం బయటకు రావడంతో విషయం పెద్దది అవుతుందని భావించిన పెద్దమనుషులు కల్పించుకొని పింఛన్‌దారులకు కొంతమందికి వారి సొమ్ము తిరిగి ఇప్పించారని సమాచారం.
గ్రామస్థులు కొందరు దీనిపై వాలంటైర్‌ని ప్రశ్నించగా తనకు తెలియదని,, వారి దగ్గర బయటి వ్యక్తులు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయని చెప్పుకొచ్చారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.