తన భార్యకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని చెప్పారు. ఆమె చనిపోయిన రోజున డ్రగ్ పార్టీ జరిగిందని, ఆ పార్టీలో నలుగురు వ్యక్తులు పాల్గొన్నారని, వారంతా ఘటనా స్థలం నుంచి పారిపోయారని అప్పట్లో వార్తలు వచ్చాయని ఆయన గుర్తు చేశారు.
సిబిఐటి వద్ద ఉన్న ఫాంహౌస్‌లో తన భార్య చనిపోయిందంటూ తొలుత చెప్పారని, ఆ తర్వాత మాట మార్చారని చెప్పారు. తన భార్యది ఆత్మహత్యా లేక హత్యా అనే విషయాన్ని తేల్చాలని పోలీసులను కోరారు. తన తోడల్లుడితో తమకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని ఫణీంద్ర తెలిపారు.
ఆరోజు పార్టీలో పాల్గొన్న వారంతా తప్పించుకు తిరుగుతున్నారని చెప్పారు. సిబిఐటి వద్ద ఆమె చనిపోయిందని వారు చెప్పారని, ఆ తర్వాత మీనాక్షి మ్యాన్షన్‌లో జరిగిందని రాయదుర్గం సిఐ దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.