మీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవుతోందా? ఈ విషయాన్ని మీ గ్యాస్ ఏజెన్సి వారికి చెప్పినా పట్టించుకోవడం లేదా? గ్యాస్ డెలివరీ బాయ్‌ని పంపడానికి తాత్సారం చేస్తున్నారా? అయితే, మీరు ఒక పని చేయండి. 1906కి కాల్ చేయండి.
మీ ఇంట్లో గ్యాస్ పొయ్యికి కొత్త సిలిండర్ అమర్చడానికి ప్రయత్నించినప్పుడు, గ్యాస్ లీక్ అవుతోందని గమనించారా? అయితే, నాబ్‌ను ఆపివేసి, మీ గ్యాస్ ఏజెన్సీకి కాల్ చేయండి. కానీ, అది ఆదివారం కావడంతో వారు స్పందించలేదా? వారు సోమవారం దీనికి హాజరు అవుతామని చెప్పారా?
దానికి ఎటువంటి ఛార్జీ లేదని, గ్యాస్ ట్యూబ్ చెడిపోతే తప్ప, ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదని కూడా చెపుతారు. బాయ్ వచ్చి గ్యాస్ తనిఖీ చేసి సిలిండర్‌కు కొత్త వాషర్ పెడతాడు. ఈ చిన్న పనికి, అతనికి ఎలాంటి పారితోషికాన్ని ఇవ్వనవసరం లేదు.