తెలంగాణ ముద్దుబిడ్డ జైపాల్ రెడ్డి..

ఆదివారం, 28 జులై 2019 (10:43 IST)
తెలంగాణ ముద్దుబిడ్డ ఎస్.జైపాల్ రెడ్డి అని, ఆయన మరణవార్త విని చాలా బాధపడినట్టు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. జైపాల్ రెడ్డి మరణవార్తపై రాహుల్ ఓ ట్వీట్ చేశారు. 
"కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత జైపాల్ రెడ్డిగారి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. ఆయన ఓ గొప్ప పార్లమెంటేరియన్. తెలంగాణ ముద్దుబిడ్డ. ప్రజాసేవలో జీవితాంతమూ గడిపిన వ్యక్తి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని రాహుల్ వ్యాఖ్యానించారు.
 
అలాగే, జైపాల్ రెడ్డి మరణపట్ల తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ కవిత తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు కేటీఆర్, కవిత ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జైపాల్‌రెడ్డి భౌతికకాయానికి మాజీ ఎంపీలు కవిత, వినోద్‌కుమార్ నివాళులర్పించారు. 
 
జైపాల్‌ రెడ్డి మృతిపట్ల తెలంగాణ మంత్రులు జగదీశ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సంతాపం తెలియజేశారు. నల్గొండ జిల్లాతో జైపాల్‌రెడ్డికి ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా సంతాపం తెలుపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు