ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కొరకు సీఎం జగన్ పలు సంక్షేమ కార్యక్రమాలు, పథకాలను చేపట్టి వాటిని అంచెలంచెలుగా నెరవేరుస్తూ ప్రజాభిమానాన్ని చూరగొంటున్న విషయం తెలిసిందే. ఈ దిశగా కాపుల ప్రజా సంక్షేమం కోసం మరో పథకాన్ని రూపొందించారు. కాపుల కోసం ప్రత్యేకంగా కాపునేస్తం అనే పథకాన్ని ఏర్పరిచారు.
ఇందులో లబ్దిదారుల కోసం రూ. 142.87 కోట్లను విడుదల చేశారు. లబ్దిదారుల కొత్త జాబితా ప్రకారం అర్హులకు ఈ సాయాన్ని అందించనున్నారు. కొత్త జాబితా ప్రకారం 95,245 మందికి పథకాన్ని వర్తింపజేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లబోయిన వేణు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి కాపు నేస్తం నిధులను అందిస్తామని తెలిపారు.