రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా? లేదా, అన్నదానిని విచారిస్తామని స్పష్టం చేసింది. న్యాయపరమైన అవకాశాలను పరిశీలించి తమకు తెలియజేయాలని, పిటిషనర్ తరపున న్యాయవాది రవితేజను ధర్మాసనం ఆదేశించింది.
రాష్ట్రంలో దాఖలవుతున్న హెబియస్ కార్పస్ పిటిషన్లను పరిశీలిస్తున్నామని, సోషల్ మీడియాలో న్యాయమూర్తులపై వచ్చిన పోస్టింగ్స్‌పై రిజిస్ట్రార్ జనరల్ ఫిర్యాదు చేసినా సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని గమనించామని హైకోర్టు వ్యాఖ్యానించింది.
రాజ్యాంగ ప్రక్రియ ద్వారా పాలన జరుగుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలించాల్సి ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. మీరు కూడా ఈ విషయంలో అఫిడవిట్ ఫైల్ చేయాలని ధర్మాసనం సూచించింది. రెడ్డి గౌతమ్, లోచిని హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయ విచారణ విధానాన్ని తప్పుబట్టడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది.