జగన్ 'రెడ్డి రాజ్యం'లో కాదేదీ కేసుకు అనర్హం : నారా లోకేశ్

శుక్రవారం, 3 జులై 2020 (15:32 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి రాజ్యంలో ఒక కేసు పెట్టాలంటే చీమకుట్టినా చాలని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. పెళ్లికి వెళ్లారని తమ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై కేసు పెట్టారనీ, మరో పార్టీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడుపై నిర్భయ కేసు పెట్టారని గుర్తుచేశారు. ఇపుడు జగన్ రెడ్డి రాజ్యంలోని లోపాలను ఎత్తి చూపినందుకు మాజీ మంత్రి కొల్లు రవీంద్రపై హత్య కేసు నమోదు చేశారని ఆరోపించారు. 
 
ఇద అంశంపై నారా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ రాజ్యంలో కాదేదీ కేసుకు అనర్హం అని వ్యాఖ్యానించారు. పెళ్లికి వెళ్లారని యనమల రామకృష్ణుడిపై కేసు పెట్టారని, అయ్యన్నపాత్రుడిపై నిర్భయ కేసు నమోదు చేశారని, అచ్చెన్నాయుడిపై అక్రమ కేసు బనాయించారని, బుద్ధా వెంకన్నపై హత్యాయత్నం కేసు పెట్టారని, ప్రభుత్వాన్ని నిలదీసినందుకు పంచుమర్తి అనురాధపై పేటీఎం గ్యాంగ్ దాడి చేస్తోందని లోకేశ్ ట్వీట్ చేశారు.
 
ఇప్పుడు జగన్ రెడ్డి చెత్త పాలనను, అవినీతిని ఎండగట్టినందుకు కొల్లు రవీంద్రపై హత్య కేసు నమోదు చేశారని ఆరోపించారు. కొల్లు రవీంద్రపై ప్రభుత్వ వేధింపులను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు. మరో బీసీ నేతపై వేధింపులు మొదలయ్యాయని, కొల్లు రవీంద్రకు తాము అండగా నిలుస్తామని హ్యాష్ ట్యాగ్‌ల రూపంలో లోకేశ్ వెల్లడించారు. బంధువర్గానికి రాష్ట్రాన్ని పంచిన జగన్ రెడ్డి బీసీ నాయకత్వాన్ని అణచివేయడమే లక్ష్యంగా కేసులు పెడుతూ, దాడులకు పాల్పడుతున్నారని నారా లోకేశ్ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు