జగన్ సంకల్ప బలం చాలా గొప్పది: మంత్రి అప్పలరాజు

సోమవారం, 5 జులై 2021 (07:05 IST)
సొంత ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కళ అని, ఆ కళని నిజం చేసి స్వంత ఇంటిని నిర్మించుకుంటున్న తరునమిది అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ, పాడిపరిశ్రమాభివృద్ది శాఖా మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. రామక్రిష్ణాపురం వద్ద గల జగనన్న కాలనీ లే అవుట్ లో గృహనిర్మాణాల  కార్యక్రమాలను ఆయన సందర్శించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇల్లు నిర్మించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కళ అని అన్నారు. ఇళ్లు నిర్మించుకోవడం అనేది ఆశామాషీ విషయం కాదన్నారు. సిఎం జగన్మోహన్ రెడ్డి సంకల్ప బలం చాలా గొప్పదని అన్నారు. పెరదలందరికి పక్క ఇళ్లు, అన్ని మౌళిక సదుపాయాలు కలిగించి సుందరమైన గ్రామాలుగా తీర్చి దిద్ది మహిళలకు పట్డాలు ఇవ్వడం వారికి గృహం కట్టించడం చూస్తే దేశం ఏ రాష్ట్రం చేయలేని సాహసం అని అన్నారు.

అటువంటి ఇంటిని అర్హత కలిగిన ప్రతీ పేదవానికి అందించాలని ప్రభుత్వం దీక్ష పూనిందని చెప్పారు. అందులో భాగంగా నవరత్నాల పేరిట కార్యక్రమాన్ని రూపకల్పన చేసి జగనన్న కాలనీలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు అందరూ కలిసికట్టుగా నడుంబిగిస్తే గాని ఇంత మందికి ఇళ్లు మంజూరుచేయడానికి సాధ్యపడలేదని, జగనన్న కాలనీల పేరిట ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇస్తున్నామని అన్నారు.

గతంలో స్థలాన్ని మంజూరుచేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ స్వంత ఇంటిని దగ్గరుండి నిర్మించుకోవాలని కోరారు., ప్రభుత్వం ఆ అవకాశాన్ని కూడా లబ్ధిదారులకు కల్పించిందన్నారు. గృహ నిర్మాణానికి సంబంధించిన ఇసుక, సిమెంటు, స్టీలు, ఇతరత్రా సామాగ్రిని ప్రభుత్వ ధరలకే అందించడం గొప్ప విషయమని చెప్పారు.

అనంతరం జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న గృహ లబ్ధిదారుల మనోగతాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. పలాస నియోజకవర్గంలో ఏ అర్హులకు అయినా ఇళ్లు స్థలం రాలెరదు. పేద వారికి ఇళ్లు లేదు అని అనిపిస్తే మంత్రి కార్యాలయంకు నేరుగా వచ్చి సమస్యను చెప్పాలన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు