చిరుత సినిమాతో తన బ్లాక్‌బస్టర్ అరంగేట్రం చేసిన చరణ్ పరిశ్రమలో 18 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా పెద్ది సినిమా నుంచి స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చరణ్ ని అద్భుతమైన మాస్, ఇంటెన్స్ లుక్‌లో ప్రజెంట్ చేస్తోంది. రైల్వే ట్రాక్‌పై ఒంటరిగా నిలబడి, భుజంపై బ్యాక్‌ప్యాక్ వేసుకుని, వేళ్ల మధ్య బీడీతో చరణ్ మాస్ వైబ్ అదిరిపోయింది.
ఈ పోస్టర్ ఓ లేయర్ మాత్రమే. సినిమాలో చరణ్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారు. ప్రతి లుక్ వెనుక ఎమోషన్ పీక్ లో ఉండబోతోంది. పాత్ర కోసం ఆయన చేసిన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్, ఇంటెన్స్ ప్రిపరేషన్, ఇమర్షివ్ ట్రైనింగ్ ఆయన డెడికేషన్‌కి నిదర్శనం.
ప్రస్తుతం, ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది, రామ్ చరణ్, ఇతర ప్రధాన తారాగణం షూటింగ్ లో పాల్గొంటున్నారు.
తారాగణం: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ