ప్ర‌త్యేక హోదాపై ప‌ట్టువీడ‌ని వైసీపీ నేత జ‌గ‌న్... నేనింతే!

సోమవారం, 12 సెప్టెంబరు 2016 (14:02 IST)
హైద‌రాబాద్ : ప‌్ర‌త్యేక హోదా క‌న్నా ప్ర‌త్యేక ప్యాకేజీనే ముద్దు అని టీడీపీ త‌న బాణీ మార్చింది. కానీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత మాత్రం ప‌ట్టు వీడ‌టం లేదు. హోదాను ఫ‌ణంగా పెట్టి... ఏపీ సీఎం ప్ర‌త్యేక ప్యాకేజీకి క‌క్కుర్తి ప‌డుతున్నార‌ని, ఏపీ ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌భుత్వం అర్ధంత‌రంగా ముగించేసింద‌ని... ప్ల‌కార్డుల‌తో అసెంబ్లీ ఎదుట వైసీపీ నేత‌లు బైఠాయించారు. 
 
పార్టీలు ఎమ్మెల్యేలంతా వై.ఎస్. జ‌గ‌న్ నేతృత్వంలో అసెంబ్లీ ఎదుట ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలిపారు. ఓటుకు నోటు కేసు భ‌యంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్రం ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి... ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెడుతున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. మొన్న‌టివ‌ర‌కు 15 ఏళ్ళపాటు హోదా కావాల‌న్న సీఎం... ఇపుడు హోదా క‌న్నా ప్యాకేజీ చాలా బెట‌ర్ అని క‌ల్ల‌బొల్లి మాట‌లు చెపుతూ, ప్ర‌జ‌ల‌న్ని మ‌భ్య‌పెట్ట‌లేర‌ని ఎద్దేవా చేశారు. హోదా కోసం త‌మ పార్టీ, క‌లిసివ‌చ్చే వారంద‌రితో ఉద్య‌మిస్తుంద‌ని జ‌గ‌న్ చెప్పారు.

వెబ్దునియా పై చదవండి