బాబు నోట ముందస్తు ఎన్నికల మాట.. ఎన్నికల యుద్ధానికి జనసేన సిద్ధమేనన్న పవన్!

శనివారం, 22 ఏప్రియల్ 2017 (13:11 IST)
తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్బంగా వైకాపా నుంచి పార్టీలో చేరిన నేతలతో కలిసి పనిచేయాలని చంద్రబాబు పార్టీ నేతలను కోరారు. ఇంకా ఏపీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయని.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ సర్కరు భావిస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇందులో భాగంగా ఏపీకి ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అందుకే పార్టీలోని నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, తద్వారా మరోసారి ఏపీలో విజయం సాధించడం సులభం అవుతుందన్నారు. 
 
ఈ నేపథ్యంలో చంద్రబాబు నోట ముందస్తు ఎన్నికల మాట రాగానే.. జనసేన పార్టీ చీఫ్, సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించింది. ట్విట్టర్లో ముందస్తు ఎన్నికలపై మాట్లాడారు. ముందస్తు ఎన్నికలు వస్తే పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని సంచలన ప్రకటన చేశారు. ఎన్నికల యుద్దం ఒకవేళ ముందస్తుగా వస్తే జనసేన సిద్ధేమే అని పవన్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యింది. 

వెబ్దునియా పై చదవండి