2019 ఎన్నికలపై పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దృష్టి పెట్టారు. జనసేన పార్టీని బలోపేతం చేసే పనిలో పడ్డారు. పాలకుల వలన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. అందుకే సామాజిక స్పృహ ఉన్న వారినే ఎంపిక చేసుకుంటున్నారు. జనసేన నిర్వహిస్తున్న శిబిరాల గురించి అందులో పాల్గొంటున్న యువత ప్రసంగాన్ని జనసేనాని హైదరాబాదులో వీక్షించారు. పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ జనసేన ఎంపిక శిబిరాల్లో కొనసాగుతున్న ఎంపికల ప్రక్రియ విధానం, పాల్గొన్న యువత ఇచ్చిన స్పీచ్‌ల వీడియోలను చూశారు.
ఈ సందర్భందా పవన్ మాట్లాడుతూ.. ఇకపై పాలకులు చేసే తప్పులకు ప్రజలు ఇబ్బంది పడకూడదన్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ చేసిన తప్పులు మళ్లీ పునరావృతం కాకూడదన్నారు. అందుకే సామాజిక స్పృహ ఉన్నవారిని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు. జూలై నాటికి జనసేన సైనికుల ఎంపిక ప్రక్రియ ముగుస్తుందని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే.. పవన్ కల్యాణ్ తాజా సినిమా కోసం సన్నబడ్డారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం సారథి స్టూడియోలో జోరుగా సాగుతోంది. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో పవన్‌ను కలుసుకునేందుకు అభిమానులు భారీ సంఖ్యలో స్టూడియో వద్దకు వస్తున్నారు.