హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో NIK స్టూడియోస్ బ్యానర్లో కిషోర్ అన్నపురెడ్డి అభిషేక్ పిక్చర్స్‌తో కలిసి నిర్మించిన పాన్-ఇండియా ఫిలిం 'నాగబంధం' చేస్తున్నారు. లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ప్రీ-లుక్, ఫస్ట్ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విరాట్ కర్ణ పాత్ర కోసం పూర్తిగా ట్రాన్స్ ఫర్మేషన్ అయ్యారు. నాగబంధం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.