థియేటర్ వద్ద చేసే సందడిలాగానే గ్రామాల్లో చేయండి.. జనసేన సైనికులకు పవన్ పిలుపు

శనివారం, 8 సెప్టెంబరు 2018 (15:52 IST)
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక సందడి మొదలైంది. ముఖ్యంగా, తెలంగాణ రాష్ట్రంలో ఎనిమిది నెలల కంటే ముందుగానే అసెంబ్లీ రద్దు అయింది. దీంతో రాష్ట్ర అసెంబ్లీకి ఒకటిరెండు నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈనేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.
 
నిజమైన జనసైనికులు సత్తా చూపాల్సిన సమయం ఆసన్నమైందంటూ పిలుపునిచ్చారు. సినిమా రిలీజ్‌ అయితే థియేటర్‌ వద్ద చేసిన సంబరాల మాదిరిగానే ఇప్పుడు గ్రామ గ్రామానా సభ్యత్వ నమోదుతో సందడి చేయాలని కోరారు. సినిమా థియేటర్లను అలంకరించేబదులుగా ఆయా గ్రామాలు, నగరాల్లో జెండా దిమ్మలు ఏర్పాటు చేయాలని అభిమానులను కోరారు. ఈ నెల 9 లోపు ఒక్కొక్కరు వంద సభ్యత్వాలు చేర్పించడంతో పాటు పది మంది కలిసి జెండా దిమ్మలు ఏర్పాటు చేసి పవన్‌ అభిమానుల సత్తా ఏంటో చాటాలని పిలుపునిచ్చారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు