ఫీచర్ కంట్రిబ్యూటర్లకు జనసేన ఆహ్వానం...

శనివారం, 3 ఆగస్టు 2019 (14:17 IST)
జనసేన పార్టీ ఆధ్వర్యంలో త్వరలో ఓ మ్యాగజైన్ పత్రిక రానుంది. ఇందుకోసం ఫీచర్ కంట్రిబ్యూటర్లకు ఆహ్వానం పలుకుతోంది. ఈ మ్యాగజైన్ కోసం పని చేసేందుకు ఫీచర్ కంట్రిబ్యూటర్లను ఆహ్వానిస్తూ జనసేన ఓ ప్రకటనను జారీచేసింది. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, అనంతపురం, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ నగరాల్లో పత్రిక కోసం పనిచేసేందుకు ఫీచర్ కంట్రిబ్యూటర్లు కావాలని జనసేన కోరింది. 
 
అభ్యర్థులు ఏదైనా సామాజిక సమస్యను ఎంచుకుని రెండు పేజీలకు మించకుండా వ్యాసాన్ని రాసి [email protected] కు పంపాలని ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ లేఖతోపాటు.. పేరు, ఫోను, చిరునామా, ఇతర వివరాలను కూడా పంపించాలని కోరింది. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ట్వీట్ చేసింది. జనసేన పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు పవన్ కళ్యాణ్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు