పవన్ ప్రకటనపై జేపీ హర్షం...ఇంకా ఏమన్నారంటే?

శుక్రవారం, 6 మార్చి 2015 (12:03 IST)
ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగి తప్పిదాలు పునరావృతం కాకుండా చూడాలని లోక్‌సత్తా వ్వవస్ధాపకుడు జయప్రకాశ్ నారాయణ సూచించారు. గురువారం విశాఖపట్నంలోని జీవీఎంసీ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద సంకల్ప దీక్ష చేపట్టారు.

ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్షలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడుతూ.. రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలు భూమి సేకరించడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను ఆయన స్వాగతించారు. 
 
హైదరాబాద్‌లోనే అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు ఏర్పాటు చేయడంతో విభజన సందర్భంలో ఏదురైన సమస్యలను ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలోనూ ఇదే విధానాలను అమలు చేయాలనుకోవడం సరికాదన్నారు. గోదావరి నుంచి వృథాగా పోయే 300 టీఎంసీల నీటి సంరక్షణ కోసం చేస్తున్న ప్రయత్నాలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.

వెబ్దునియా పై చదవండి