ట్రావెల్స్ బస్సుల వివాదం: ఆధారాలతో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. అరెస్ట్ చేసిన పోలీసులు

మంగళవారం, 27 డిశెంబరు 2016 (11:35 IST)
ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వివాదంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేటు బస్సుల అనుమతుల అంశంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీఏ ఆఫీసుకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు బస్సుల విషయంలో జేసీ సవాల్‌ను స్పీకరించి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే జేసీని గోషామహాల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.  
 
అయితే తాను అన్ని ఆధారాలతో ఆర్టీయే కార్యాలయానికి వస్తే.. తనను అరెస్టు చేశారని, ఇది తగదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనతో ఆర్టీయే కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాసగౌడ్ ఆరోపించగా, తమవద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు. ఇంతలో జేసీని పోలీసులు అరెస్టు చేశారు. 

వెబ్దునియా పై చదవండి