ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతి కేసులో అరెస్టయితే పవన్ కళ్యాణ్‌ను పరామర్శించి పొత్తులపై చర్చించేవారని రాష్ట్ర మంత్రి జోగి రమేష్ అన్నారు. బీజేపీతో చేతులు కలుపుతూనే.. టీడీపీతో పవన్ కలుస్తున్నారని విమర్శించారు.
పవన్, చంద్రబాబు మళ్లీ కలవడం ఏంటి? చంద్రబాబు చేసిన అవినీతి ప్రజలందరికీ తెలుసని, చేసిన పాపాలకు చంద్రబాబు జైలుకెళ్లారన్నారు. వైఎస్ జగన్‌తో యుద్ధం అంటే 5 కోట్ల మంది ప్రజలతో చేసే యుద్ధం అని తెలిపారు.
కోట్లాది మంది డ్వాక్రా అక్కాచెల్లెళ్లు, 66 లక్షల మంది తాతలు, వితంతువులు, వికలాంగులపై చేస్తున్న పోరాటమని జోగి వెల్లడించారు. సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు సంక్షేమం, అభివృద్ధి జరుగుతుందన్నారు.