రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్నది అందరికీ తెలిసిందే. ఒక రాజకీయంలోనే కాదు.. ఏ రంగంలోనైనా అదే పరిస్థితి. ఒకరేమో తెలుగు సినీ పరిశ్రమలో అగ్రహీరో, మరొకరేమో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత. అస్సలు ఇద్దరికీ పెద్దగా పరిచయం లేదు. రాజకీయంగా చూస్తే ఎన్టీఆర్ పక్కా తెలుగుదేశం. తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి దగ్గరుండి మరీ ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్. కానీ అప్పట్లో తెలుగుదేశం పార్టీ మాత్రం అధికారంలోకి రాలేదు. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్. కానీ చంద్రబాబు నాయుడుతో మాత్రం టచ్ లోనే ఉన్నారు.
ఒకరోజు పాటు పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్‌కు వచ్చారు వై. ఎస్ జగన్. శంషాబాద్ విమానాశ్రయంకు జగన్ చేరుకున్న సమయంలో అక్కడే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఇద్దరూ రెండు నిమిషాల పాటు మాట్లాడుకున్నారు. ఒకరినొకరు యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇదంతా బాగానే ఉన్నారు ఉన్నట్లుండి జూనియర్ ఎన్టీఆర్ మీతో ఒక సెల్ఫీ కావాలంటూ అడిగారు.