జగన్‌కు పిచ్చి బాగా ముదిరింది.. అచ్చెన్నాయుడు విమర్శలు

ఆదివారం, 30 ఆగస్టు 2015 (16:32 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి పిచ్చి బాగా ముదిరిందని, అందుకే త్వరలోనే వైపాకా ప్రభుత్వం ఏర్పాటవుతుందని ధర్నాల్లో చెపుతున్నారని ఏపీ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు. ఆయన ఆదివారం మాట్లాడుతూ... ప్రత్యేక హోదా డిమాండ్‌ను అడ్డంపెట్టుకుని జగన్ డ్రామాలకు తెరదీశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి ఏవిధంగా లబ్ది చేకూరుతుందో తెలియకుండా జగన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. 
 
టీడీపీ, బీజేపీ మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీడీపీ నుంచి బీజేపీ విడిపోతే, అప్పడు తాము బీజేపీతో జట్టుకట్టవచ్చని జగన్ భావిస్తున్నారన్నారు. బీజేపీతో చెలిమి చేసి, కేసులు మాఫీ చేయించుకునేందుకు జగన్ తాపత్రయపడుతున్నాడని అచ్చెన్న విమర్శించారు. 
 
మరోవైపు... రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల భర్తీకి తెర లేవబోతోంది. ఇప్పటికే ఇంజినీరింగ్ శాఖలోని పలు ఖాళీల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసిన విషయంతెలిసిందే. తాజాగా ఏపీలోనూ కొలువుల జాతరకు రంగం సిద్ధమవుతోంది. విశాఖలో ఏపీ హోం మంత్రి చిన్నరాజప్ప ఆదివారం మాట్లాడుతూ.. పోలీసు శాఖలోని ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిపికేషన్ జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. 

వెబ్దునియా పై చదవండి