చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కాకినాడను కైవసం చేసుకోవడంపై చంద్రబాబు తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. కొద్దిసేపటి క్రితం ఫలితాలను మంత్రులతో కలసి సమీక్షించిన ఆయన, గెలుపునకు కృషి చేసిన వారిని అభినందించారు. ఈ ఫలితం తనకు సంతృప్తినిచ్చిందని, ఇదే స్ఫూర్తితో మరింత అభివృద్ధి చేద్దామని అన్నారు.
మంత్రులు నారాయణ, ప్రత్తిపాటి, కళా వెంకట్రావులతో సమావేశమైన చంద్రబాబు, అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని వ్యాఖ్యానించారు. కాగా, ఇప్పటివరకూ విడుదలైన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ 30, బీజేపీ 3, వైకాపా 9, ఇతరులు 3 స్థానాలను (గెలుపు ప్లస్ ఆధిక్యం) దక్కించుకున్నారు.