కాకినాడలో 'వార్‌ వన్‌సైడ్'... 25 ఏళ్ల తర్వాత ఎగిరిన పసుపు జెండా

శుక్రవారం, 1 సెప్టెంబరు 2017 (10:34 IST)
కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వార్‌వన్‌సైడ్‌గా మారింది. మొన్నటికిమొన్న నంద్యాల ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఇపుడు కాకినాడ ఎన్నికల్లో కూడా గెలుపు బావుటా ఎగురవేయనుంది. ఫలితంగా రెండు పుష్కరాల తర్వాత కాకినాడపై టీడీపీ జెండా రెపరెపలాడనుంది. 
 
1985లో కాకినాడ మునిసిపాలిటీగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ అక్కడ గెలిచింది. టీడీపీ పార్టీ ప్రారంభమైన తర్వాత కాకినాడకు జరిగిన తొలి ఎన్నికల్లో మాత్రమే ఆ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఆపై మరెన్నడూ ఇక్కడ టీడీపీ గెలవలేదు. కాంగ్రెస్ పార్టీయే కాకినాడను ఏలుతూ వచ్చింది.
 
తిరిగి ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు కాకినాడ తమకు దక్కడంపై తెలుగుదేశం నేతలు ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. మొత్తం 48 డివిజన్లు ఇక్కడ ఉండగా, హాఫ్ మార్క్ ఫిగర్‌ను దాటేసింది. ఇప్పటికే టీడీపీ 27 డివిజన్లలో టీడీపీ అధిక్యంలో ఉంది. వైకాపా 7 డివిజన్లలో, ఇతరులు 2 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్నారు. 
 
సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పాలనలో ఉన్న కాకినాడ, ఈ ఎన్నికల్లో టీడీపీ అభివృద్ధి నినాదానికి పట్టం కట్టింది. కాగా, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో జతకట్టి టీడీపీ పోటీ చేయగా, వైకాపా, కాంగ్రెస్, ఇతర పార్టీలు వేర్వేరుగా పోటీ చేశాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు