బంగ్లాదేశ్ యువతిని కనిగిరి వాసి పెళ్ళి చేసుకున్నాడు. అయితే ఆమె మైనర్ కావడంతో పాటు పాస్ పోర్టు లేకపోవడంతో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే కనిగిరి ప్రాంతంలో నివాసం ఉండే బెంగాల్‌కు చెందిన బాలకృష్ణ అనే యువకుడు సదరు యువతిని వివాహం చేసుకుని తీసుకొచ్చాడు. పాస్‌పోర్టు లేకపోవడంతో యువతిని అరెస్టు చేసి వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌లోని జట్రాబరి అనే గ్రామానికి చెందిన స్వీటీ మండల్ అక్కడ ఇంటర్ చదువుతూ సయ్యద్ ఇస్లాం సుమన్ బహరీ అనే యువకుడుని ప్రేమించి నాలుగు నెలల క్రితం పెళ్ళి చేసుకుంది. ఆ వివాహం ఇష్టం లేని యువతి తల్లిదండ్రులు బెంగాల్‌కు చెందిన బాలకృష్ణతో ఈనెల 16న బెంగాల్‌లో వివాహం చేశారు. సదరు బాలకృష్ణ కొంత కాలంగా వినుకొండ, కనిగిరి ప్రాంతాల్లో ఆర్‌ఎంపీగా పనిచేస్తూ ప్రస్తుతం కనిగిరిలో ఉంటున్నాడు.
బెంగాల్‌లో స్వీటీ మండల్‌ను పెళ్ళి చేసుకున్న బాలకృష్ణ అక్కడ నుంచి ఈనెల 26న ఒంగోలు వచ్చారు. సదరు యువతికి ఇక్కడ భాష సమస్య కాగా పోలీసులు తొలుత బాలకృష్ణను విచారించారు. బెంగాల్‌కు చెందిన యువతిని తాను వివాహం చేసుకొచ్చానని చెప్పారు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు బహరీని కోర్టులో హాజరు పరిచగా బంగ్లాదేశ్ అమ్మాయిని చైల్డ్ హోమ్‌కు తరలించారు.