కాణిపాకం బహుదానదిలో యువతి శవం.. రేప్ చేసి హత్య చేశారా?

బుధవారం, 25 మే 2016 (16:09 IST)
స్వయంభు వరసిద్ధి వినాయకస్వామి కొలువై ఉన్న చిత్తూరు జిల్లా కాణిపాకంలో దారుణం జరిగింది. కాణిపాకం సమీపంలోని బహుదానదిలో ఒక యువతిని అత్యాచారం చేసి హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో బహుదానది సమీపంలో ఒక మృతదేహాన్ని మేకల కాపరులు గుర్తించి, స్థానిక పోలీసులకు సమాచారం చేరవేశారు.
 
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూడగా 18 యేళ్ళ వయసున్న యువతిగా గుర్తించారు. అయితే యువతి ఒంటిపై బట్టలు లేకపోవడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. యువతిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసి బహుదానదిలో పడేసినట్లు భావిస్తున్నారు. సంఘటనా స్థలానికి డాగ్‌ స్క్వాడ్‌‌తో తనిఖీలు జరిపించారు. మృతదేహాన్ని చిత్తూరుప్రభుత్వాసుప్రతికి తరలించారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి